బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది..