గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ లలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి*

A9 న్యూస్ తూప్రాన్ ఏప్రిల్ 6

సన్నబియ్యంతో పేదవారి కడుపు నింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తూప్రాన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం తూప్రాన్ మండలం లోని గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ లలో చౌక ధరల దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని భాస్కర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించి నిరుపేద మహిళలకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే మొదటి ప్రయోగం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయం అని అన్నారు. గుండ్రెడ్డిపల్లి, ఇస్లాంపూర్ లలో సన్న బియ్యం పంపిణీ చేయగా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి తోపాటు రాష్ట్ర నాయకులు నేత మహేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు తాడురీ కృష్ణారెడ్డి, బియ్యాని తిరుపతిరెడ్డి, ఆకుల శ్రీరాములు, టి. యాదిరెడ్డి, రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, ఎల్. అంజిరెడ్డి, ఎల్. రామ్ రెడ్డి, డి. కృష్ణ, ఎం. రాములు, జీ. మహిపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే గుండ్రెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల కల్యాణమును తిలకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తూప్రాన్ రామాలయం లో శ్రీసీతారాముల కళ్యాణం సమయంలో హాజరై దర్శనం చేసుకొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఉమ్మన్నగారి భాస్కర్ రెడ్డి తోపాటు నర్సాపూర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆవుల రాజిరెడ్డి, తూప్రాన్ మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్, నేత మహేందర్ రెడ్డిలు రాములవారికళ్యాణ కార్యక్రమానికి హాజరై శ్రీసీతా రామచంద్ర స్వామి నీ దర్శించుకొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *