Oplus_131072

 

భద్రాది జిల్లా: ఏప్రిల్ 05

భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు ఈరోజు లొంగిపోయారు.

లొంగిపోయిన మావోయిస్టు లు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులుగా తెలిసింది, మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసు లు నిర్ణయించారు.. ఆది వాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు.

దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు.లొంగిపోయిన మావోయిస్టుల్లో 20 మంది మహిళలు, 66 మం ది,పురుషులు ఉన్నారు.

గత నాలుగు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 66 మంది మావో యిస్టులు అరెస్ట్ అయ్యారు. 203 మంది లొంగిపోయా రు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు 25 వేల రూపాయల చెక్కును ఐజీ అందజేశారు.

ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ములుగు జిల్లా ఎస్పీ శబరీష్, పలు వురు పోలీస్ అధికారులు ఉన్నారు. అజ్ఞాతాన్ని వీడం డి.. జనజీవన స్రవంతిలో కలవండి. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాన్ని అందిస్తామన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *