హైదరాబాద్: ఏప్రిల్ 05

బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, సామాజిక న్యాయ పోరాట యోధుడు, అణగారిన వర్గాల ఆశాదీపం, విశిష్ట పార్లమెంటేరియన్, నిజ మైన ప్రజాస్వామ్యవాది, విశిష్ట కేంద్ర మంత్రి, సమర్థ పరిపాలనాదక్షుడు, అసా ధారణ ప్రతిభావంతుడైన వక్త. బాబూ జగ్జీవన్ రావ్.

జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన దళిత చిహ్నం. ఏప్రిల్‌ 5వ తేదీ ఆయన జయంతి. ఒక సామాన్య రైతు కుటుంబం లో 1908 ఏప్రిల్ 5న బాబూ జగ్జీవన్ రామ్ జన్మించారు. ఆయన తండ్రి శోబీరామ్, తల్లి వసంతి దేవి. బీహార్‌‌‌‌లోని షాహా బాద్ ఇప్పుడు భోజ్‌‌‌‌పూర్, జిల్లాలోని చంద్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు.

ఆయనకు అన్నయ్య సంత్ లాల్ తోపాటు ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జగ్జీవన్ రామ్ అర్రా టౌన్ స్కూల్ నుండి మెట్రిక్యు లేషన్ మొదటి విభాగంలో ఉత్తీర్ణుడయ్యాడు.కుల ఆధారిత వివక్షను ఎదుర్కొంటున్నప్పటికీ, జగ్జీవన్ రామ్ బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్ సైన్స్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసి, తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు.

1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంత రాయంగా పార్లమెంటు సభ్యుడిగా ప్రపంచ రికార్డు సాధించారు. అత్యంత గౌరవనీయమైన దళిత నాయకులలో ఒకరైన జగ్జీవన్ రామ్ 1971 భార త-పాకిస్తాన్ యుద్ధంలో భారత రక్షణ మంత్రిగా పనిచేశారు.

బ్రిటీష్ పాలనకు వ్యతి రేకంగా జరిగిన పోరాటాల్లో జగ్జీవన్ రామ్ ఉత్సాహంగా పాల్గొనే వారు. సామాజిక సమానత్వంపై అందరినీ చైతన్య పరిచేందుకు 1934లో ఆలిండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్, అఖిల్ భారతీయ రవిదాస్ మహాసభలకు పునాది వేశారు.

అలాగే.. 1935 అక్టోబర్ 19న దళితులకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారు. బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో 1940లో అరెస్టయ్యారు. రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఆయన పాత్ర ఎనలేనిది. దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం ఆయన వాదించారు.

1946లో జవహర్ లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వ కేబినె ట్లో అతి చిన్న వయసులో మంత్రి అయ్యారు. స్వాతం త్య్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కర ణలు తీసుకొచ్చారు. 1940 నుంచి 1977 వరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ,అనుబంధ సభ్యునిగా.. 1948 నుంచి 1977 వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూ సీ,ప్రతినిధిగా కూడా పనిచేశాడు. కమ్యూని కేషన్స్, రైల్వే, రవాణా, ఆహార, వ్యవసాయం, రక్షణ వంటి కీలక శాఖల బాధ్యతలు కూడా నిర్వహించారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *