*సామాజిక ప్రజలు అర్హులైన లబ్ధిదారులు సన్న బియ్యంతో తినాలి.
ఎ9 న్యూస్ చేగుంట ఏప్రిల్ 4
చేగుంట మండలం మాక్కరాజ్ గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు సన్న బియ్యం పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ
ప్రతి పేద వాళ్ళ సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తో అన్నం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత పథకంలో భాగంగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిదని వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో సన్న బియ్యం పంపిణీ పథకం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రేషన్ కార్డులను, అందజేస్తామన్నారు. ఆహార భద్రత కార్డులోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ఆరు కిలోల చొప్పున, అంత్యోదయ కార్డు ఒక్కంటికి 35 కిలోలు చొప్పున, అన్నపూర్ణ కార్డు ఒక్కంటికి 10 కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈకార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి మాదవి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండల్ రెడ్డి, ఉపాధ్యక్షులు జామల్ పూరి రాజారామ్,మండల యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్,కార్యక్రమంలో డీలర్ శ్రీను,జింక శ్రీనివాస్, యాదిరెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలనర్స్, మొగులయ్య, స్వామి, తలారి యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.