*సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం.
*దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటగా శ్రీకారం.
సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో వనపర్తి శాసనసభ్యులు శ్రీ తూడి మేఘారెడ్డి .
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం దేశ చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సామాన్యులకు సంపన్నులకు సమాన భోజనం అందించాలన్న ఉద్దేశంతో సన్నబియ్యాన్ని పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం వనపర్తి నియోజకవర్గం లోని ఖిల్లా ఘణపురం, పెద్దమందడి, వనపర్తి, మండల కేంద్రాలలోని రేషన్ దుకాణాలలో ఆయన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి హాజరై లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంతో ప్రభుత్వానికి రూ 5173 కోట్ల రూపాయలు అదనంగా భారం పడుతుందని అయినా నిరుపేదలు సైతం సన్న బియ్యంతో భోజనం చేయాలన్న తలంపుతో ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
వనపర్తిలో 324 రేషన్ దుకాణాలకు సంబంధించి ప్రతినెల 3309 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి 1,59353 తెల్ల రేషన్ కార్డు ధరలకు ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున 5,22,363 మందికి ఈ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్న మని ఎమ్మెల్యే వివరించారు.
గతంలో దొడ్డు బియ్యాన్ని సరఫరా చేసే సమయంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేవని, అక్రమ రవాణా జరిగేదని నేడు సన్న బియ్యం పంపిణీతో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా ఆదనపు కలెక్టర్ ఆర్డిఓ ఆయా మండలాల ఎమ్మార్వోలు రేషన్ డీలర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.