తెలంగాణ సర్కార్ రేషన్ కార్డు లబ్ధి దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రాష్ట్రవ్యా ప్తంగా దొడ్డు బియ్యం స్థానంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం చేరాయని తెలిపారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్ర మాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారని పొన్నం వెల్లడించారు.
దేశంలోనే మొదటిసారి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో నివిసి స్తున్న వారు హైదరాబాద్ లో కూడా బియ్యం తీసుకోవచ్చని తెలిపారు.
ఏప్రిల్ నెలలో రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగు తుందని పొన్నం స్పష్టం చేశారు