A9 న్యూస్ డెస్క్:
తెలంగాణ: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా హుజూర్నగర్నుంచి ఉగాది పండుగ రోజే ప్రారంభించిస్తున్నట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.
రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్. చౌహాన్‌తో కలిసి మాట్లాడుతూ.. కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసే రేషన్ బియ్యం చాలా మంది లబ్ధిదారులు ఉపయోగించుకోవడం లేదని, దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్‌లో అక్కడక్కడా అమ్మకాలు చేయడం జరుగుతుంది. ఏటా రూ. 7వేల కోట్ల నుంచి రూ. 8వేల కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం అవుతుందన్నారు. తెలంగాణలో దాదాపు 3.10 కోట్ల మంది ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో రాష్ట్ర జనాభాలో 85 శాతం మందికి ప్రయోజనం ఉంటుందన్నారు.
అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్నబియ్య అందుతుంది. స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో జనాబాకు ఇంత పెద్ద సంక్షేమ పథకం ప్రవేశపెట్టలేదన్నారు. దీనిని సామాజిక న్యాయం కోసం ఒక నమూనాగా అభివర్ణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టం అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి మంజూరు చేస్తామని, కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు. కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల అర్హుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నాటికి 89 లక్షల 73వేల 708 కార్డులు ఉండేవని, గత పదేళ్ళలో 49వేల 479 కొత్త కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులుండగా 2.85 కోట్ల లబ్దిదారులు రేషన్సరుకులు తీసుకున్నట్లు వివరించారు.
కొత్త రేషన్ కార్డులో క్యూ ఆర్ కోడ్ మాత్రమే ఉంటదని చిప్ ఉండదని స్పష్టం చేశారు. రేషన్ కార్డుపై ప్రధాని ఫొటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, 30 లక్షల మందికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయబోతోందని తెలిపారు. దీంతో కార్డుల సంఖ్య కోటికి పెరుగుతుందని, మొత్తం లబ్దిదారులు సంఖ్య 3.10 కోట్ల పెరుగుతుందన్నారు. కొత్తకార్డులు దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు(బీపీఎల్) త్రివర్ణ కార్డులు జారీ చేస్తామని, దారిద్ర్య రేఖకు ఎగువ ఉన్నవారికి (ఏపిఎల్) గ్రీన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు.
*పీడీఎస్బియ్యం కోసం రూ. 10, 665 కోట్లు ఖర్చు:
ప్రస్తుతం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సంయుక్తంగా రూ. 10,665 కోట్లు ఖర్చు చేస్తున్నాయని, కేంద్రం రూ. 5,489.5 కోట్లు , రాష్ట్రం రూ. 5,175.5 కోట్లు భరిస్తుందన్నారు. కొత్త లబ్ధిదారులను చేర్చుకున్న తర్వాత, మొత్తం ఖర్చు రూ.13,523 కోట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వాటా రూ.8,033 కోట్లకు పెరుగుతుందని, తెలంగాణ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం దాదాపు రూ.2,858 కోట్లు ఉంటుందన్నారు. పేదల ప్రయోజనాల దృష్ట్యా ఈ ఖర్చును భరించడానికి ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని చెప్పారు. దశలవారీగా, పప్పు, ఉప్పు వంటి ఇతర ముఖ్యమైన వస్తువులను పంపిణీకి కూడా జరుగుతుందని, అదే సమయంలో, ప్రభుత్వం రేషన్ డీలర్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు. వారి కమీషన్లు ఇప్పటికే పెంచామని, వారు విక్రయించగల ఇన్వెంటరీని విస్తరించడానికి, తద్వారా వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి డెలివరీ గొలుసులో వారి పాత్రకు మద్దతు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.