కరీంనగర్ జిల్లా: మార్చి 23
అధికార పార్టీ నాయకుల మాటలు విని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారులకు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా పార్టీ అధికారంలోకి రాగానే వారికి తగిన బుద్ధి చెప్తామని అన్నారు. అప్పుడు వారిని కెసిఆర్ వదిలిపెట్టిన నేను మాత్రం వదిలిపెట్టనని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. నేను కేసీఆర్ అంత మంచి వాడిని కాదని అన్నారు.

కరీంనగర్‌ జిల్లా పోరాటాల పురిటిగడ్డ అని కేటీఆర్‌ అన్నారు. అదివారం ఉమ్మ డి కరీంనగర్ జిల్లా పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు కరీంనగర్‌ జిల్లా అంటే సెంటిమెంటని, కరీంనగర్‌ నుంచి ఏ పని మొదలు పెట్టినా విజయ వంతం అయితది అనే విశ్వాసం కేసీఆర్‌ కు ఉన్న దని, కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత మొదటి బహిరంగ సభ సింహగర్జణ 2001 మే 17న ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో పెట్టారని కేటీఆర్‌ చెప్పారు.

పార్టీ కార్యకర్తల తొలి సమా వేశాన్ని కూడా కరీంనగర్‌లో నే పెట్టామని చెప్పారు. నా డు ‘తెలంగాణ ఉద్యమం ఏడున్నది..? వైఎస్‌ సంక్షేమ పథకాల గాలిలో కొట్టుకు పోయింది’ అని అప్పటి పీసీసీ అధ్య క్షుడు పిచ్చి ప్రేలాపనలు చేస్తే.. కేసీఆర్‌ ఉద్యమ ఊపు చూపించ డానికి కరీంనగర్‌లో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ బరిలో దిగారని గుర్తుచేశారు.

అప్పుడు కేసీఆర్‌ను ఏకంగా 2 లక్షల ఓట్ల మెజా రిటీతో గెలిపించి కరీంనగర్‌ దమ్మేందో చూపెట్టిన గడ్డ కరీంనగర్‌ గడ్డ అని కొనియాడారు. పోరాటాల పురిటిగడ్డ ఈ కరీంనగర్‌ గడ్డ అని ప్రశంసలు కురిపించారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఒక ప్రత్యేకమైన పార్టీ అని, ఈ దేశంలో ఎన్నో పార్టీలు పుట్టినయ్‌.. మాయమైపో యినయ్‌.. అని, ఉద్యమ పార్టీగా పుట్టి పదేళ్లు అధి కార పార్టీగా వెలుగొందిన పార్టీ అని కేటీఆర్‌ చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ ప్రజల తలరాతలు మార్చిందని అన్నారు.

గత 16 నెలల నుంచి అధికార పార్టీకి ముచ్చె మటలు పట్టిస్తూ ప్రతిపక్ష పార్టీ అంటే ఎట్లుం డాల్నో చాటిచెబుతోందని చెప్పా రు. మన పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఒకే ఒక్క లక్ష్యంతోన ని, 25 ఏళ్ల క్రితం 2001 ఏప్రిల్‌ 27న పెద్దలు కేసీఆర్‌ నాయకత్వంలో జయశంకర్‌ గారి లాంటి ఎంతో మంది మహాను భావుల ఆశీర్వా దంతో బీఆర్‌ఎస్‌ పార్టీ పురుడుపోసుకున్నదని గుర్తుచేశారు

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *