ఢిల్లీ హైకోర్టు, రాజ్యాంగాన్ని సవరించి ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’తో భర్తీ చేయాలన్న సుప్రీం కోర్టు 2020 ఆదేశాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ వేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, కేంద్రం సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది. ఇండియా అనే పేరు వలసవాద వారసత్వం అని, భారత్ అనే పేరు దేశ చరిత్ర, సంస్కృతికి ప్రతిబింబం అని పిటిషనర్ కోర్టుకు వివరించారు.

రాజ్యాంగాన్ని సవరించి, ఇండియా అనే పదాన్ని “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాన్ని వెంటనే పాటించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదనే పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ తరఫున న్యాయవాది కోర్టును కోరారు. ఇండియా అనే పేరు వలస వారసత్వం అని, ఇది దేశ నాగరికత నైతికతను పూర్తిగా సూచించదని, అయితే భారత్ దాని సాంస్కృతిక, చారిత్రక గుర్తింపులో లోతుగా పాతుకుపోయిందని కోర్టుకు తెలిపారు. నవంబర్ 15, 1948న రాజ్యాంగ సభలో జరిగిన చర్చల సందర్భంగా, దేశాన్ని ‘భారత్’ లేదా ‘హిందూస్థాన్’గా పేరు మార్చడంపై విస్తృతమైన చర్చలు జరిగాయని పిటిషనర్ హైలైట్ చేశారు.

అయితే, రాజ్యాంగ తుది వెర్షన్ రెండు పేర్లను అలాగే ఉంచింది, ఈ విషయం పరిష్కారం కాకుండా వదిలివేసింది. “భారత్ అనేది మన దేశపు ఏకైక పేరు అని నిర్ధారించడం ద్వారా ఇండియా స్థానంలో భారత్‌ లేదా హిందూస్థాన్‌ పెట్టాలని పిటిషనర్‌ కోర్టును కోరారు. 2020లో సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర పాటించేలా చూడాలని విన్నవించుకున్నారు. పిటిషన్‌ నమహా తరఫు సీనియర్‌ న్యాయవాది సంజీవ్‌ సాగర్‌ వాదలతో ఏకీభవించిన ఢిల్లీ హైకోర్టు.. ఇండియా స్థానంలో భారత్‌ లేదా హిందూస్థాన్‌ అని పెట్టాల్సిందిగా సుప్రీం తీర్పును అనుసరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *