A9 న్యూస్ మార్చ్ 19
బుధవారం పట్టణ కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రతిపాదిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం సభలో బిల్లు ఆమోదం పొందడం చరిత్రత్మక మనీ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆర్మూర్ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు దోండి రమణ తెలిపారు. బీసీలకు మద్దతుగా కాంగ్రెస్పార్టీ ఉందని చెప్పడానికి రిజర్వేషన్ల పెంపే నిదర్శనమని పేర్కొన్నారు కామారెడ్డి డిక్లరేషన్ను విజయవంతంగా అమలు చేశారని పేర్కొన్నారు దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వమే కులగనన సర్వే చేసిందని చెప్పారు సర్వే వివరాల ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమన్నారు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన బిల్లును శాసనా సభకు ఏకగ్రీవంగా ఆమోదించడంపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరూ సంతోషం వ్యక్తం చేశారు అని ఇది తెలంగాణ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకనుందని దోండి రమణ పేర్కొన్నారు బీసీ లందరూ ప్రజా ప్రభుత్వాన్ని గౌరవించాలని కోరారు బీసీ రిజర్వేషన్లు అమలుపై బీసీ బిడ్డలందరూ సంబరాలు చేసుకోవాలని ఇట్టి కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అన్నారు. అలాగే వినయ్ అన్న ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో మరియు పరిసర ప్రాంతాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని రాబోవు రోజుల్లో ఇంకా మరెన్నో అభివృద్ధి పనులు చేయడానికి సిద్ధంగా ఉన్న వినయ్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.