*ఒకే రోజు రెండు సార్లు ఇంటి నెంబర్ తో…

*అదే స్థలానికి ఇంకో సారి సర్వే నంబర్ తో;

*మున్సిపల్ రికార్డు లో ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్.

తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ లో అక్రమాల లీలలు ఆలస్యంగా వెలుగులోకి.

*తూప్రాన్ లో సర్వే నంబర్ 97/రు లోని 5 గుంటల భూమిని 12 గుంటలు గా చేసి 3 ఫేక్ డాకుమెంట్లు గా రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రాజ్ కుమార్*

*ఆందోళన కు దిగిన బాధిత రైతు ..*

*సబ్ రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటున్న బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి*

*అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ సబ్ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన…*

*అక్రమాలకు అడ్డాగా మారిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ..*

తూప్రాన్, మార్చి, 18.

మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. ఒకే భూమిని మూడుసార్లు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి మూడు ఫేక్ డాకుమెంట్లు తయారు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తూప్రాన్ బైపాస్ లో సర్వే నంబర్ 97/రు లోని 5 గుంటల భూమిని 12 గుంటలు గా చేసి మూడు ఫేక్ డాకుమెంట్లు గా రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రాజ్ కుమార్. విషయం తెలుసుకున్న బాధిత రైతు గోవర్ధన్ రెడ్డి ఆందోళన చేశారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటున్న బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి , అక్రమ రిజిస్ట్రేషన్ ల కేసులో తాజాగా మాజీ సబ్ రిజిస్ట్రార్ జైలుకు వెళ్లిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ లో విచ్చలవిడిగా అక్రమాలు జరుగుతున్న జిల్లా సబ్ రిజిస్ట్రార్ పట్టించుకోకపోవడం పై స్థానిక ప్రజలు మండి పడుతున్నారు. తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారుతోంది. వివరాల్లోకి వెళ్ళితే….. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధి రావెళ్లి గ్రామానికి చెందిన బూర్గుల వెంకటమ్మ కు పెద్దల అస్థి ద్వార సంక్రమించిన 97 రు సర్వే నంబర్ లో బైపాస్ రోడ్డు విస్తరణలో పోయిన భూమికి రెండు సార్లు నగదు చెక్కుల రూపంలో డబ్బులు పొందారు. మిగిలిన 4 గంటల భూమి ప్రోహిబోషన్ లో ఉంటే కలెక్టర్ ను సంప్రదించి క్లియరెన్స్ పొంది నాలా కన్వర్షన్ చేయించుకొని అట్టి స్థలానికి తూప్రాన్ మున్సిపల్ లో ఎం.అర్.రెడ్డి ధాబ హోటల్ ఏర్పాటు చేసి 3-65/2/బి తో 25×13 మరియు 75×49 కొలతలతో డోర్ నెంబర్ పొంది 75×49 ఒకటి, 77×71.4 అధిక కొలతలతో రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ఇలా ఉండగా అట్టి 4 గంటల భూమికి 2025 జనవరి 16న డోర్ నెంబర్ 3-65/2/బి తో 610 గజాల స్థలం ను బూర్గుల వెంకటమ్మ తన సొంత కొడుకు బూర్గుల పాపిరెడ్డి పేర డాక్యుమెంట్ నెంబర్ 158/2025 ద్వార గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించింది. కాగా అదే రోజు డోర్ నెంబర్ 3-65/2/బి/పార్ట్ తో 245 గజాల స్థలం ను డాక్యుమెంట్ నెంబర్ 159/2025 తో బూర్గుల ఉపేందర్ రెడ్డి పేర సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించింది. దీనితో ఉన్న భూమి కంటే రెండింతలు స్థలం రిజిస్ట్రేషన్ చేయించింది అనుకుంటే 2025 ఫిబ్రవరి 12వ తేదీన డాక్యుమెంట్ నెంబర్ 560/2025 తో బూర్గుల దేవేందర్ రెడ్డి పేర సర్వే నంబర్ 97రు ఓపెన్ ప్లస్ నాలుగు గంటలు సమామం 484 చదరపు గజాల స్థలం ను గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించింది. దీనితో ఆమె పేర ఉన్న నాలుగు గంటలు ఉంటే దాదాపు 12 గంటలకు ఫెక్ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించారు. ఒకే స్థలానికి మూడు సార్లు రిజిస్ట్రేషన్ చేసిన తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం బాధితులు ఆందోళనకు దిగారు. అక్కడ సబ్ రిజిస్ట్రార్ అందుబాటులో లేక పోవడంతో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ తో ఫోన్ లో జరిగిన విషయం తిలెలియజేసి ఎస్.అర్.ఓ పై శాఖా పరమైన చర్యలు తీసుకొని ఫేక్ డాక్యుమెంట్లు వెంటనే రద్దు చేయాలని పిర్యాదు చేశారు. అంతే గాకుండా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన డాక్యుమెంట్ వ్రైటర్ పై, రిజిస్ట్రేషన్ చేసిన, రిజిస్ట్రేషన్ చేయించుకొన్న అందరినీ కేసులో ముద్దాయిలుగా చేర్చి కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి ఇలాంటి అక్రమాలు మరోసారి జరుగకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ కోర్టు కేసు పనిపై ఈ రోజు సెలవులో వెళ్ళడం తో తిరిగి బుధవారం రోజు తిరిగి ఆందోళన చేస్తామని బాధితులు తెలిపారు. బాధిత రైతు బూర్గుల గోవర్ధన్ రెడ్డి తో పాటు బూర్గుల శేఖర్ రెడ్డి, గొల్ల పెంటయ్య యాదవ్, తుమ్మేట శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఆందోళన చేపట్టారు. బూర్గుల గోవర్ధన్ రెడ్డి కి న్యాయం జరిగే వరకు పోరాటం ఉదృతం చేసి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేపట్టి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లుతామని తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *