హైదరాబాద్:మార్చి 09
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువా త కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ కావాలని నిర్ణయించారు.
ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఎమ్మెల్సీ అభ్యర్ధి విషయంలోనూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు పూర్తి కావటంతో ఇప్పుడు కొత్త సమీకర ణాలు మొదలయ్యాయి. ఈ నెల 12 నుంచి ప్రారం భం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల కేంద్రంగా కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు అధికార – విపక్ష పార్టీలు సిద్దం అవుతున్నాయి.
ఈ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 11న పార్టీ ఎమ్మెల్సీలు – ఎమ్మెల్యేల తో కేసీఆర్ కీలక భేటీ కానున్నారు.
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వా న్ని టార్గెట్ చేయటం పై కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేయనున్నా రు.