*అబద్ధపు ప్రచారాలను కొట్టి పడేసిన రూరల్ ఎమ్మెల్యే
-కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని..? తెచ్చిన నిధులు ఎన్ని ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు…..
-ప్రజల అభివృద్దే మా లక్ష్యం – అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దు…
-అబద్ధపు ప్రచారాలు చేసే పార్టీలకు రాబోయే కాలంలో పుట్టగతులు ఉండవు….
-కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేయడంలో బీజేపీ పార్టీ దిట్ట…
-జిల్లా కలెక్టర్ నవోదయ పాఠశాలకు సంబంధించిన ఫైల్ పరిశీలన…
-త్వరలో 25 ఎకరాల స్థలంలో 25 కోట్లకు పై చీలుకు నిధులతో నవోదయ పాఠశాల నిర్మాణ పనులు చేపడతాం….
-రూరల్ నియోజకవర్గం లోనే నవోదయ పాఠశాలను నిర్మిస్తాం- రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి…
-అన్ని వర్గాల ప్రజలకు ప్రజా పాలనను అందించిన ఏకైక ప్రభుత్వం- కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య…
-కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను ఓర్వలేక బిజెపి, బిఆర్ఎస్ ప్రభుత్వాలు బురద చల్లే ప్రయత్నాలు….
A9 న్యూస్ ప్రతినిధి:
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని స్థానిక సొసైటీ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెలిమేల నర్సయ్య కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…
ప్రతీ పక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి పథకాలను ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని అబద్దపు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పై బురద చల్లే ప్రయత్నాలు చేయడం శోచనీయమని ఇలాంటి ప్రచారాలు చేపడితే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమేల నర్సయ్య హెచ్చరించారు. అలాగే బీజేపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాలు గతంఎన్నడూ చేయలేని అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ గ్రామం, పట్టణాలలో, జిల్లా స్థాయిలో రాష్ట్ర మంతటా బడుగు బలహీన వర్గాల వారికి పరిపాలనను, ప్రజా పాలనను అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. అయితే విద్యార్థుల ఉన్నత చదువుల కొరకై నిజామాబాద్ జిల్లాకు నవోదయ పాఠశాల మంజూరు కావడం జరిగిందని ఇందుకు గాను నిజామాబాద్ జిల్లా వసూలు హర్షించదగిన విషయమని అన్నారు. గత ఆరు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెసిడెన్షియల్ పాఠశాలలో భాగంగా సుద్దపల్లి దగ్గర సుమారు 25 ఎకరాల స్థలంలో ఒక 25 కోట్ల నిధులతో నవోదయ పాఠశాల, కళాశాలను, నిర్మించడం జరుగుతుంది అన్నారు. అందులో భాగంగానే రూరల్ నియోజకవర్గం లో రూరల్ ఎమ్మెల్యే నవోదయ పాఠశాల నిర్మాణానికొరకై సంబందించి మూడు స్థలాలను చూపెట్టడం జరిగిందని తెలిపారు. ఇట్టి పాఠశాలకు సంబందించిన ఫైల్, పాఠశాల కొరకు జిల్లా కలెక్టర్ స్థలం పరిశీలన జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పరిశీలన జరుగుతుండగానే బీజేపీ వాళ్ళు రూరల్ నియోజకవర్గంలో నవోదయ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు అని అబద్దపు ప్రచారాలు చేపడుతున్నారని వాపోయారు. ఈ అబద్దపు ప్రచారాల వలన కాంగ్రెస్ పార్టీ చేయబోయే అభివృద్ధి పనులకు అడ్డంకుగా ప్రతీ పక్ష పార్టీలు కాకుల వలె ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రతీ పక్ష పార్టీలు బురద చల్లే ప్రయత్నాలు ఎన్ని చేసిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మాత్రమే ప్రయత్నాలు చేసే పార్టీ తప్ప అభివృద్ధినీ అడ్డుకునే పార్టీ కాదని స్పష్టం చేసారు. నవోదయ పాఠశాల కొరకు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో నిజామాబాద్ జిల్లాలో నిర్మించబోయే పాఠశాలకు సంబందించి చర్చించినట్లు తెలిపారు. ఖచ్చితంగా రూరల్ ప్రాంతంలో నవోదయ పాఠశాలలు ఉండాలని ఏ ప్రాంతం ఎమ్మెల్యే ఆ ప్రాంతం లో నవోదయ పాఠశాలలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అడ్డుకోవడం లేదు. నవోదయ పాఠశాలకు సంబందించిన ఫైల్ జిల్లా కలెక్టర్ వద్ద ఉన్నట్లు తెలిపారు. నవోదయ పాఠశాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినట్లు బీజేపీ పార్టీ దుష్ప్రచారాలు చేపట్టడం సరికాదని పాఠశాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలేదని మీడియా సమావేశంలో అన్నారు. అంతే కాకుండా నవోదయ పాఠశాలను నిజామాబాద్ జిల్లాలో నిర్మించి తీరుతాం అని అన్నారు. అదృష్టం బాగుంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే నవోదయ పాఠశాలను నిర్మించి తీరుతామని అన్నారు. ఈ విషయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. రూరల్ ఎమ్మెల్యే ఇక్కడ వద్దు అక్కడ వద్దు అన్నట్లు బీజేపీ పార్టీ బద్నామ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారనీ అన్నారు. ఇది అంతా తప్పుడు ప్రచారమని భూపతి రెడ్డి నవోదయ పాఠశాలను పట్టించుకోవడం లేదు అది వేరే జిల్లాకి పోతుంది వేరే నియోజకవర్గంకి పోతుంది అనడం అదంతా తప్పుడు ప్రచారాలు. ఎమ్మెల్యే పట్టుదలతో ఉండటం వల్లనే పాఠశాలకోసం మూడు స్థలాలను చూపెట్టారని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే అన్నిటికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రతీ ఒక్క ఎమ్మెల్యేకి అడిగే హక్కు ఉన్నట్లు తెలిపారు. అందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. మన రూరల్ నియోజకవర్గంలో నిర్మించాలని పట్టుదలతో ఉన్నట్లు తెలిపారు. ప్రజలు, విద్యావంతులు, విద్యార్థులు మేధావులు దీన్ని గమనించాలని అన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని అన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు నిజానికి అభివృద్ధి చేయాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కు సంబందించిన ఫండ్స్ ఎన్నో ఉన్నాయని నిజామాబాద్ మాధవ నగర్ రైల్వే గేట్ వద్ద పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తేనే పనులు చేయగలగుతున్నారు. వచ్చి పోయే ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చేతిలో ఉన్న చిన్న చిన్న పనులు చేయలేని బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రులు ఏమి చేయలేరు. వీళ్ళంత ఎం చేస్తున్నట్లు అవకాశం దొరికితే చాలు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి అభివృద్ధి నీ అడ్డుకుంటున్నాడు అంటూ ప్రచారం చేయడంలో ముందుంటారని అన్నారు. ఇదంతా భూటకం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే నిధులను తెలంగాణ ప్రభుత్వం తప్పకుండ సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసారు. ఇందులో ప్రజలు ఎలాంటి అపోహలకు పోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, అరుణుల శ్రీనివాస్ పుప్పాల సుభాష్, వి డి సి చైర్మన్ గంగరాజు, రాకేష్, అమీద్, పోతరాజు, నరసయ్య, సురేందర్ గౌడ్, రమేష్, చక్రపాణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.