ధర్పల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఉద్యోగులు కేక్ కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్.సుభంగీ,డాక్టర్ మౌనిక మాట్లాడుతూ…. మహిళలకు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని గల్లి నుండి ఢిల్లీ వరకు ప్రతి దాంట్లో మహిళల ప్రాముఖ్యత ఉంటుందని, ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్.సుభంగీ,డాక్టర్ మౌనిక సూపర్వైజర్ భూలక్ష్మి, స్టాఫ్ నర్స్, సిబ్బంది లత,సుమలత,కల,ఆశాలు కళ్యాణి,నిరీక్షణ తదితరులు పాల్గొన్నారు.