హైదరాబాద్ న్యూస్ ఈస్ట్ జోన్ ప్రతినిధి – చంద్రశేఖర్ : కేసీఆర్ ఒక్క సీటుకే పోటీ చేయాలని నిర్ణయిస్తే.. ఇప్పటికే పార్టీ అభ్యర్ధి పైన నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టం అవుతోంది. ప్రధానంగా దాసోజు శ్రావణ్ కు ఖాయంగా కనిపిస్తోంది. కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో గవర్నర్ కోటాలో శ్రావణ్ కు ఎమ్మెల్సీ సీటు పైన నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత న్యాయ పరమైన అంశాలతో అవకాశం దక్కలేదు. ఇప్పుడు బీసీకే సీటు ఇవ్వాలని గులాబీ బాస్ నిర్ణయించారు. దీంతో.. శ్రావణ్ తో పాటుగా జోగు రామన్న, బిక్షమయ్య గౌడ్ సైతం సీటు ఆశిస్తున్నారు. ప్రస్తుతం పదవీ కాలం ముగియనున్న సత్యవతి రాథోడ్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్, రసమయి బాల కిషన్ పేర్లు చర్చకు వచ్చాయి. దీంతో, పోటీ .. అభ్యర్ధుల పై కేసీఆర్ నిర్ణయం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

 

 

 

 

 

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ సమయంలోనే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు అటు సీఎం రేవంత్.. ఇటు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. నాలుగు స్థానాలు కాంగ్రెస్ – మిత్రపక్షా లకు దక్కే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది. దీంతో.. కేసీఆర్ కొత్త వ్యూహం అమలు చేసేందుకు సిద్దమయ్యారు.

 

 

తెలంగాణలో అయిదు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. కాంగ్రెస్ కు నాలుగు, బీఆర్ఎస్ కు ఒక సీటు దక్కనుంది. కాగా, కాంగ్రెస్ నుంచి ఒకటి సీపీఐకు ఖరారు అయింది. ఎంఐఎంకు మరో సీటు దక్కుతుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి మూడు స్థానాల పైన కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్ధులను ఎంపిక చేస్తున్నారు. అయితే, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్ధులను బరిలో నిలిపే అవకాశం పైన చర్చ చేస్తున్నట్లు సమాచారం.

 

 

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. వీరి పైన అనర్హత వేటు వేయాల ని కోరుతూ బీఆర్ఎస్ కోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసులో నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 లోగా నోటీసుల పైన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఇదే సమయంలో కేసీఆర్ కొత్త స్కెచ్ సిద్దం చేస్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన ఒత్తిడి పెంచే విధంగా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నట్లు గులాబీ పార్టీ నేతల సమాచారం. సుప్రీంలో వీరి కేసు కీలక దశకు చేరిన సమయంలో కేసీఆర్ నిర్ణయం ఆసక్తి కరంగా మారుతోంది.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *