తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత….
శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ బ్లూమ్ కార్యక్రమం సందర్భంగా ప్రిన్సిపల్ ముత్తుస్వామి….
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
తల్లిదండ్రులను గౌరవించడం పిల్లల బాధ్యత అని తెలియపరచుతూ ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల లో ఫ్యామిలీ బ్లూమ్ అను కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది .ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ముత్తుస్వామి మాట్లాడుతూ ఆధునిక కాలంలో పిల్లలకు మమత, అనురాగాలు బందు, బాంధవ్యాలు అనేవి తెలియకుండా పోతున్నాయని అంతేకాకుండా నేటి సమాజంలో పిల్లలకు తల్లిదండ్రులకు మరియు పెద్దవారికి ఇచ్చే గౌరవం విలువలు అనేవి నశించిపోతున్న తరుణంలో విద్యార్థులకు తమ తల్లిదండ్రుల యొక్క విలువలను తెలియపరిచేలా ఫ్యామిలీ బ్లూమ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు .ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను బలపరిచేలా చేయడమే లక్ష్యమని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత వారి తల్లిదండ్రులకు పాదాభిషేకం చేయించి ఆశీర్వాదాలు అందిస్తూ తల్లిదండ్రుల యొక్క విలువలను తెలియపరచడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ కోఆర్డినేటర్ ప్రసన్న, ప్రీ ప్రైమరీ కోఆర్డినేటర్ శ్రీవిద్య, డీన్ రాకేష్ ,సి బ్యాచ్ ఇంచార్జ్ రాజేశ్వర్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థిని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.