హైదరాబాద్:ఫిబ్రవరి 11
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధిం చి కీలక అప్‌డేట్ ఇచ్చింది. మీసేవ కేంద్రాల్లో రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడంపై స్పష్టత ఇచ్చింది.
మీ-సేవ వెబ్‌సైట్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని పౌరసరఫ రాల శాఖ నిర్ణయం తీసు కుంది. మీసేవ అధికారుల తో.. పౌరసరఫరాల శాఖ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా మీ సేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఇందుకోసం మీసేవ వెబ్ సైట్‌లో ‘మీ- దరఖాస్తుల స్వీకరణ’ ఆప్షన్ అందుబా టులోకి తెచ్చారు.
దీని ద్వారా రేషన్ కార్డులు లేని వారు ఏ సమస్య లేకుండా మీ సేవ వెబ్‌సైట్ లో కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. మీసేవ వెబ్‌సైట్‌లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం రాత్రి మళ్లీ మొదలైంది.
ఐతే.. ఒక్కో దరఖాస్తుకూ రూ.50లు తీసుకుంటు న్నారు. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు అని ప్రభుత్వం మీ సేవ అధికారులకు క్లారిటీ ఇచ్చింది.