. తమకు న్యాయం చేయాలని వేడుకున్న బాధిత కుటుంబ సభ్యులు
A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ:
భీమ్‌గల్ కు చెందిన నేషనల్ టెంట్ హౌస్ యజమాని అజ్మతుల్లా కు నాలుగు ఏండ్ల క్రితం భూమి అమ్మినట్టు రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భీమ్‌గల్ లో వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తాము విక్రయించిన భూమి పై తమకు హక్కులు ఉన్నాయని ముజాహిద్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నాలుగు ఏండ్ల క్రితం తాము అవసరం కొరకు సుమారు ఐదు వందల గజాలు అజ్మత్ కు విక్రయించడం జరిగిందని చెప్పారు. పట్టణం లోని పాత వాటర్ ట్యాంక్ వద్ద విక్రయించిన భూమిలో ముజాహిద్ కుటుంబ సభ్యులకు ఎలాంటి హక్కులు లేవన్నారు. కేవలం ఓనర్ షిప్ సర్టిఫికెట్ తీసుకొని ఒక ప్లాట్ ను వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అవి తప్పా వారి వద్ద ఎలాంటి డాకుమెంట్స్ లేవని ఏమైనా ఉంటే పక్కా వివరాలతో ముందుకు రావాలని, అనవసరంగా కొనుగోలు చేసిన వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దని సూచించారు.ఈ సమావేశం లో రియాజ్, అర్షద్ కుటుంబ సభ్యులు నసీమ్, ఫహీమా, తస్లిమ్, ఫర్వీన్, బేబీ తబస్సుమ్ పాల్గొన్నారు.