నిజామాబాద్ A9 news
కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆర్మూర్ డివిజన్ కాంటాక్ట్ ఏఎన్ఎంలు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంట్రాక్ట్ ఏఎన్ఎంల అధ్యక్షురాలు గంగా జమున మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు పనిచేస్తున్న ఇంతవరకు రెగ్యులర్ చేయలేదని, చాలీచాలని వేతనాలతో నెట్టుకొస్తున్నామని. పిల్లలకు మంచి చదువులు చెప్పించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యశాఖ మంత్రి హరీష్ రావు కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను పర్మినెంట్ చేయాలని కన్నీటి పర్యంతమై విజ్ఞప్తి చేశారు.
ఈ ధర్నాలో ఉపాధ్యక్షురాలు కే ప్రమీల, కార్యదర్శి శ్యామల, విజయలక్ష్మి, అమృత, రాజవ్వ, రోజులిన్, వీణ, రజిత, గిరిజ, స్వప్న, గోదావరి, విజయలక్ష్మి, ఆర్మూర్ డివిజన్ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.