*టీఎస్ఐసి ఆధ్వర్యంలో విలేజ్ ఇన్నోవేషన్ అవార్డ్- 2025 కు ఎంపికైన శ్రీశాంత్…….
*- గైడ్ టీచర్ గా పసుపుల రఘునాథ్…..
వేల్పూర్ జనవరి 27, A9 న్యూస్ ప్రతినిధి:
వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన శ్రీశాంత్ విద్యార్థి మార్గదర్శక ఉపాధ్యాయులు పసుపుల రఘునాథ్ సారథ్యంలో తయారుచేసిన పాడి డ్రైయింగ్ మెషిన్ కు గ్రామస్థాయిలో టీఎస్ఐసి ఆధ్వర్యంలో ఇంటింటా ఇన్నోవేటర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం గ్రామస్థాయి అవార్డు రావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం ఆర్ మల్లీశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఈ అవార్డును గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యదర్శి రవికుమార్ మరియు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి ఈ అవార్డును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మరియు వీడీసీ సభ్యులు అవార్డు పొందిన విద్యార్థిని మరియు గైడ్ టీచర్ రఘునాథ్ అభినందించడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ తాను తయారుచేసిన పరికరం రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు దీనివల్ల వారి సమస్యలు ముఖ్యంగా నడుమునొప్పి కాళ్ల నొప్పులు తగ్గుతాయని తెలిపారు ఈ పరికరంతో ఎంత ధాన్యం నయనా సులువుగా ఆరబెట్టవచ్చని తెలిపారు ఇది కరెంటు లేకుండా పనిచేస్తుందని గ్రామంలో గల అందరూ రైతులు దీన్ని ఉపయోగించాలని తెలిపారు రిపబ్లిక్ డే సందర్భంగా గ్రామంలో గల పాత విద్యార్థులు 2005_06 బ్యాచ్ విద్యార్థులు పాఠశాలకు నాలుగు ఫ్యాన్లు మరియు వాటర్ ట్యాంకులను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా హెచ్ఎం వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘునాథ్ ను. శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు వీడీసీ సభ్యులు గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది.