న్యూ ఢిల్లీ: జనవరి 17
దేశ ప్రధానమంత్రిని కలవడం అంటే మాటలు కాదు ఆయనను కలిసేందుకు రాష్ట్రాల సీఎం లే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న సాధారణ విద్యార్థునికి ఆ ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు.. వివరాల్లోకి వెళితే
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని లక్కీ ఛాన్స్ కొట్టేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన అంజలి విద్యార్థిని ప్రధాని మోదీతో ముఖాముఖీగా మాట్లాడా రు. ప్రధానితో సంభాషించే ఛాన్స్ ఇచ్చినందుకు విద్యార్థి అనందం వ్యక్తం చేశారు.
పరీక్షలపై మోదీతో చర్చించి నట్లు విద్యార్థి తెలిపారు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలా నికి చెందిన స్టూడెంట్ అంజలి..ఈమధ్యే ఢిల్లీలో జరిగిన పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో ముఖా ముఖిగా మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థు లతో పరీక్షకు సంబంధిత ఒత్తిడిని తగ్గించడం, వారి విద్య ప్రయాణాలకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక అంజలి ప్రస్తుతం మోడల్ స్కూల్లో ఇంటర్ రెండో ఏడాది చదువుతుంది. ఈ కార్యక్ర మంలో ప్రధాని మోదీ కలిసే అవకాశం, ఆయనతో మాట్లాడే అశకాశం లభించింది.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అంజలిని ఎంపిక చేసింది. అంజలి ప్రధాని మోదీని కలవడంపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ రాగిణి అమె గైడ్ టీచర్ సీత సంతోషం వ్యక్తం చేశారు.
అంజలి సాధించిన విజ యం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇంత గౌరవప్ర దమైన కార్యక్రమంలో తమ పాఠశాలకు చెందిన విద్యా ర్థిని ప్రాతినిధ్యం వహించి నందుకు అంజలిని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీని విద్యార్థులు ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు.
వాటికి మోదీ సమాధానం ఇచ్చారు. ఎగ్జామ్స్ విశ్వా సంతో ఎలా ఎదుర్కొవాలో టిప్స్ చెప్పారు.