మకర సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లో మైట్రో రైలు గాలిపటం(Kite) రూపంలో ఆకాశంలో చక్కెర్లు కొట్టింది. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హైదరాబాద్ నగరంలో భోగి రోజు కైట్ ఫెస్టివల్ ఘనంగా సాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌడ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్‌లో నగర వాసులు భారీగా పాల్గొని సందడి చేశారు.. చిత్ర, విచిత్ర రూపాల్లో తయారు చేసిన గాలి పటాలను ఎగురవేశారు.
అయితే మెట్రో రైలు పతంగి మాత్రం అందరినీ ఆకర్షించింది. అనుకోనుండా చూసిన చూపరులకు నిజమైన మెట్రో రైలు గాల్లో ఉంది ఏంటని ఆశ్చర్యం కలిగించింది. దీంతో వావ్.. వాటే కైట్ అంటూ కితాబులిచ్చారు. మరోవైపు వివిధ రూపాల్లోని పతంగులు సైతం చూపరులను ఆకట్టుకున్నాయి. చిన్నారులు సైతం పతంగులకు ఎగరవేయడం చాలా ముచ్చటగా అనిపించింది. స్పైడర్ మేన్, స్నేక్స్, హల్క్స్, ఈగల్స్ రూపంలో ఉన్న పతంగులు సైతం కనువిందు చేశాయి. ఈ ఫెస్టివల్ మంగళ, బుధవారాల్లోనూ జరగనుంది. నగర వాసులు ఈ రెండు రోజులు కూడా పతంగుల పండగలో ఫుల్ ఎంజాయ్ చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు..