హైదరాబాద్:జనవరి15
హైదరాబాద్ –నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు.
వివరాల్లోకి వెళ్తే.. పుప్పాల గూడలోని అనంతపద్మనా భ స్వామి ఆలయ సమీపం లోని గుట్టపై కొంతమంది పతంగులు ఎగురవేయాడా నికి వెళ్లారు. ఈ క్రమంలో మృతదేహాలను గుర్తించా రు. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన స్థలాన్ని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మహిళ, యువకుడి,డెడ్ బాడీలను పోలీసులు బుధవారం గుర్తించారు. మృతులు మధ్యప్రదేశ్ చెందిన అంకిత్ సాకేత్, చతిస్గడ్ కు చెందిన బిందుగా పోలీసులు నిర్ధారించారు.
నానక్ రామమ్ గూడలో అంకిత్, ఎల్బీనగర్ లో బిందు నివాసం ఉంటు న్నట్లు గుర్తించారు. వీరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీ సులు అనుమానిస్తున్నారు. మృతురాలు బిందువుకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.