హైదరాబాద్:డిసెంబర్ 30

తెలంగాణ ప్రభుత్వం చేప‌ట్టే అన్ని కార్యక్రమాల్లో భాగ‌స్వామిగా ఉండాల‌నే త‌మ నిబద్ధతను కొన‌సాగిస్తామ‌ని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ సత్య నాదెళ్ల తెలిపారు.

 

హైద‌రాబాద్‌లోని స‌త్య నాదెళ్ల నివాసంలో ఆయ‌న‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం సోమ‌వారం భేటీ అయింది. ఈ సంద‌ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విష‌యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనిక‌త‌ను స‌త్య నాదెళ్ల ప్రశంసించారు.

 

నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక‌ వ‌స‌తులే ఆర్థికాభి వృద్ధికి దోహ‌ద‌ప‌డి హైదరా బాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలవని స‌త్య నాదెళ్ల అభిప్రాయ పడ్డారు.హైదరాబాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒక‌ట‌ని.. ప్రస్తుతం 10,000 మందికి ఉపాధి క‌ల్పిస్తోంద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌త్య నాదెళ్లకు తెలిపారు.

 

రాష్ట్రంలో 600 మెగావాట్ల (MW) సామ‌ర్థ్యం క‌లిగిన డేటా సెంటర్లోనూ మైక్రో సాఫ్ట్ పెట్టుబ‌డి పెట్టింద‌ని.. హైద‌రాబాద్‌తో పాటు తెలంగాణ‌ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు స‌త్య నాదెళ్లకు సీఎం రేవంత్ కృత‌జ్ఞత‌లు తెలిపారు.

 

హైదరాబాద్‌ను టెక్నాలజీ డొమైన్‌లో ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా నిలిపి వేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారిస్తున్న ఏఐ, Gen AI, క్లౌడ్‌తో సహా వివిధ సాంకేతిక అవసరాలకు అనుగుణ‌మైన వ్యవ‌స్థను అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్ మ‌ద్దతుగా నిల‌వాల‌ని సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స‌త్య నాదెళ్లకు విజ్ఞప్తి చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *