కరీంనగర్ జిల్లా: డిసెంబర్ 30

కరుడుగట్టిన నేరగాళ్లలో భయం ప్రజల్లో మనో ధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు బాసటగా నిలుచోవలసిన పోలీసు లలో ఆత్మస్థైర్యం సన్న గెలుతున్నది.

 

ప్రజలకు సమస్యలొస్తే పోలీసుల దగ్గరికి వెళతారు.. ఏ కష్టమొచ్చినా ఎంత నష్టమొచ్చినా ఎలా ధైర్యంగా బతకాలో పోలీ సులు జనాలకు మోటివేట్ చేస్తారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నవారి మనసు మార్చి జీవితంపైన భరోసాను కలిగిస్తారు.

 

జీవితమంటే ఏమిటో జీవిస్తేనే తెలుస్తుందని.. తాత్కాలిక సమస్యలకు ఆత్మహత్యలు శాశ్వత పరిష్కారాలు కావని చైతన్య పరుస్తారు. బాధల్లో ఉన్న వారికి భరోసానిచ్చి జీవితం పై ఆశలు కల్పిస్తా రు. అందుకే పోలీసులను ప్రజలు ఇంతగా నమ్ముతా రు. గౌరవిస్తారు.

 

కానీ, ఇటీవలి కాలంలో ఆ పోలీసుల జీవితాలే ప్రమా దంలో పడుతున్నాయి. సమస్యలను ధీటుగా ఎదు ర్కోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండటం పోలీసు శాఖనే కాదు.. యావత్ సమాజాన్ని నివ్వెరపరిచేలా చేస్తోంది.

 

కామారెడ్డి జిల్లాలో ఈ నెల 25 న రాత్రి చోటు చేసుకున్న ట్రిపుల్ డెత్ కేసు విచారణ ఓ పక్కకొనసాగు తుండగానే మరో పక్క తాజాగా మెదక్ జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హెడ్ కానిస్‌టేబుళ్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు.

 

కామారెడ్డి జిల్లాలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, బీబీపేట్ పోలీస్ స్టేషన్ పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ లు సదాశివనగర్ మండల పరిధిలోని అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలం సృష్టించింది.

 

అయితే ఈ వృత్తిలో కొందరు వివాహేతర సంబంధాలు పెట్టుకుం టున్నారు. వీటితోపాటు కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలతో కొంతమంది పోలీసులు అర్థాంతరంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలో ఇలాంటి కారణాలే వెలుగు చూశాయి

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *