తెలంగాణ A9 news
ఇంటి స్థలం ఉండి సొంతిల్లు కట్టుకోవాలనుకునే ప్రజల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చనుంది. దీని కోసం ‘గృహలక్ష్మి’ పథకాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులకు, 3 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్టు 10వ తేదీ లోపు గృహలక్ష్మి పథకం కోసం తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. నియోజకవర్గానికి 3 వేల మంది చొప్పున కలెక్టర్ లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.