హైదరాబాద్:డిసెంబర్ 30
నేడు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగ నుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ.నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. సంతాప దినాల సందర్భంగా అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు శాస నసభ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది.
ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టనున్నారు.
ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా దేశానికి అందించిన సేవలను గుర్తు చేస్తూ, ఆయన చేసిన కృషిని సభలో ప్రస్తావిం చనున్నారు.
రేవంత్ రెడ్డి,తో పాటు శాసనసభ సభ్యులు కూడా మాజీ ప్రధానమంత్రిపై తమ సంతాపాన్ని తెలియజేస్తా రు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని వ్యక్తం చేస్తారు.