:
హైదరాబాద్: డిసెంబర్ 29
బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ఆదివారం నిజామాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ప్రసంగించ నున్నారు. చాలాకాలం తర్వాత నిజామాబాద్‌లో కవిత పర్యటించనున్నారు.
కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి, ఆరు నెలలు తిహార్ జైలులో ఉన్న అనంతరం మొదటి సారి జిల్లాకు వస్తున్నారు. డిచ్‌పల్లి వద్ద బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలకనున్నారు.
బై పాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్, ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వరకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఎస్ సర్కిల్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పుష్పాంజలి ఘటి స్తారు. అక్కడే ప్రజలను ద్దేశించి ప్రసంగిస్తారు.