A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మండలంలోని చేపూర్ క్షత్రియ పాఠశాలలో జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా శ్రీనివాస రామానుజన్ చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు.
ఈ సందర్బంగా క్షత్రియ విద్య సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ విద్యార్దులకు తమ సందేశాన్ని పంపిస్తూ శ్రీనివాస్ రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాత గణితశాస్త్ర మేధావులలో ఆణిముత్యం లాంటి వారిని అన్నారు. మేధస్సుకు పేదరికం అడ్డురాదనే విషయం శ్రీనివాస రామానుజన్ విషయంలో నిరూపితం అయిందని, కేంబ్రిడ్జి విశ్వ విద్యాలయంలో ఎన్నో గణిత శాస్త్ర సిద్ధాంతాలను ప్రపంచానికి అందించిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. విద్యార్థులు శ్రీనివాస్ రామానుజన్ ని ఆదర్శంగా తీసుకొని చదువులో ముందుండాలని శ్రీనివాస్ తమ సందేశం లో పేర్కొన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మి నరసింహస్వామి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ బాల్యదశ నుండియే గణితంలో విశేష ప్రతిభ కనబరచి ప్రపంచ గణిత శాస్త్ర మేధావులనే ఆశ్చర్యానికి గురి చేసిన గొప్ప మేధావి అన్నారు. 1729 అనేది ఒక సామాన్య సంఖ్య కాదని ఈ సంఖ్య కు ఒక విశేష అర్థమున్నది విడమరచి చెప్పిన గొప్ప మేధావి శ్రీనివాస రామానుజన్ అని అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు ప్రదర్శించిన గణిత శాస్త్ర నమూనాలు, మరియు గణిత శాస్త్ర సంబంద నృత్య ప్రదర్శలతో చూపురులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థిని-విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.