అదిలాబాద్ జిల్లా: డిసెంబర్ 22
ఆదిలాబాద్ జిల్లా గుడిహ త్నూర్‌లో ఈరోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధిం చాడు. విషయం తెలుసు కున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.
దీంతో ఆగ్రహించిన స్థానికులు పోలీసులపై దాడికి దిగారు ఈ దాడిలో రెండు పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా.. నిండుతుడి ఇంటికి నిప్పు పెట్టారు.. ఈ సంఘటన సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.