హైదరాబాద్:డిసెంబర్ 22
పుష్ఫ 2 సినిమా హీరో అల్లు అర్జున్ ఇంటిపై కొద్దిసేపటి క్రితంరాళ్ల దాడి జరిగినట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంపై కొందరు జేఏసీ నాయకులు రాళ్ల దాడికి పాల్పడినట్లు సమాచారం. సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటన కేసులో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది.
తాజాగా అసెంబ్లీలో సంథ్య థియేటర్ వద్ద తోపులాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి,స్పందించడం, అల్లు అర్జున్ వైఖరిని తప్పుపట్ట డంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని, శాసనసభలో రేవంత్ చెప్పినవన్నీ అవాస్తవాలని సీఎం పేరు ప్రస్తావించ కుండా చెప్పారు.
తనపై ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందన్నారు. అల్లు అర్జున్ కాంగ్రెస్ ప్రభు త్వంపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు.
ఈ దశలో కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దాడి జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరనే సమాచారం..