*హైదరాబాదులో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు*

 

 

*కలం నిఘా :న్యూస్ ప్రతినిధి*

 

 

హైదరాబాద్:డిసెంబర్21

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం ప్రభుత్వం నిర్వహించనున్న క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.

 

ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు, పరిసరాల్లో ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్‌ ఎక్కువగా నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు.

 

*పలు రూట్లో ట్రాఫిక్ మళ్లింపు*

 

ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వాహనాలకు అనుమతులుండవు. పంప్‌ వద్ద నుంచి నాంపల్లి రైల్వేస్టేషన్‌-రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.

 

బషీర్‌బాగ్‌ నుంచి ఏఆర్‌ పెట్రోల్‌ పంపు వైపు వాహనాలకు అనుమతి లేదు. బీజేఆర్‌ విగ్రహం నుంచి ఎస్‌బీఐ, గన్‌ఫౌండ్రీ వైపు ఈ వాహనాలను మళ్లిస్తారు.

 

సుజాత స్కూల్‌ లేన్‌ నుంచి ఖాన్‌ లతీఫ్‌ ఖాన్‌ బిల్డింగ్‌ వైపు వాహనాలకు అనుమ తి లేదు. ఈ వాహనాలను సుజాత స్కూల్‌ జంక్షన్‌ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *