కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కేసు వివరాలను తెలుసుకునేందుకు డిఎస్పి కార్యాలయానికి వెళ్లిన పాత్రికేయుడిని డిఎస్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిన సంఘటన సోమవారం జరిగింది వివరాల్లోకి వెళితే సదాశివనగర్ మన తెలంగాణ మండల్ రిపోర్టర్ గా పని చేస్తున్న మహమ్మద్ రఫిక్ ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి వెళ్లాడు. పరిచయం చేసుకుని క్రమంలో నువ్వు ఎవరైతే నాకేంటి రా అంటూ వివిధ రకాల అసభ్య పదజాలంతో దూషించారు. తుది విలేకర్ రఫీ తీవ్ర మనోవేదనకు గురై ఈ విషయం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ NUJ (i) ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు విలేకరులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యంలో విలేకరుల పాత్ర కీలకమని సమాజంలో జరిగే అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చే వారే పాత్రికేయులని అన్నారు కామారెడ్డి డిఎస్పి. సీనియర్ రిపోర్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు కామారెడ్డి డిఎస్పి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఏ విలేకరు ఫోన్ చేసిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొక్కల వేణు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇలియాస్ కార్యదర్శి రావులపల్లి మధు స్టేట్ కౌన్సిలర్ నెంబర్ తెడ్డు సాయిలు . శ్రావణ్. రఫిక్. అంజలి రెడ్డి. మహేష్ గౌడ్ బాలాజీ. రాము.వినోద్.శ్రావణ్.రాజ్ కుమార్ ఆనంద్ తదితరులు జర్నలిస్టులో ఉన్నారు