హైదరాబాద్:డిసెంబర్ 18
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నేడు విడుదల అయ్యింది.
ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, ఫలితాల ప్రకటన వంటి వివరణలను అధికారులు వెల్లడించారు.
*ఎన్నికల షెడ్యూల్*
నామినేషన్ల దాఖలు: 18.12.2024 నుండి 19.12.2024 వరకు సాయంత్రం 4.00 గంటల వరకు.
*నామినేషన్ల చెల్లుబాటు జాబితా ప్రచురణ: 19.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.
*నామినేషన్ల ఉపసంహరణ: 20.12.2024 నుండి 21.12.2024 మధ్యాహ్నం 3.00 గంటల వరకు.
*తుది జాబితా ప్రచురణ: 21.12.2024 సాయంత్రం 5.00 గంటలకు.
*పోలింగ్ తేదీ: 04.01.2025 (ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 3.00 గంటల) వరకు.
*ఫలితాల ప్రకటన: 04.01.2025 సాయంత్రం 5.00 గంటల నుండి.
సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి, వారి హక్కుల రక్షణకు ఈ ఎన్నికలు కీలకంగా ఉంటాయని ఉద్యోగ సంఘం సభ్యులు భావిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లను సచివాలయ ఎన్నికల కమిటీ నిర్వహించనుంది.