నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ మండలం చేపూర్ లో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల నందు ఇంజనీర్స్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సమాజంలో ఇంజనీర్ల యొక్క గొప్పతనం గురించి కొనియాడారు. అలాగే శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు వంతెనలు కట్టి నీటిపారుదల త్రాగునీరు పథకాల ద్వారా జల వనరుల వినియోగానికి కృషిచేసి అంతర్జాతీయంగా ఎంతో ఖ్యాతిఘటించారని వారి యొక్క సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్కే పాండే మాట్లాడుతూ ఇంజనీరింగ్ అనగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజజీవితంలో అవసరమైన నిర్మాణాలను వ్యవస్థలను యంత్రాలను వస్తువులను తయారు చేయడానికి ఉపయోగించే ఒక అద్భుతమైన అధ్యయన శాస్త్రం అని ఇంజనీరింగ్ యొక్క విద్యకు ఉన్న ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల లోని విద్యార్థిని విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాల మోడల్ దేశాన్ని ప్రదర్శించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ వివిధ విభాగాల హెచ్ .ఓ .డి లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.