నిజామాబాద్ A9 న్యూస్:
చిట్యాల ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా వినాయక్ నగర్ లోని ఐలమ్మ విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ పక్షాన నివాళులు అర్పించిన తర్వాత జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ, చిట్యాల ఐలమ్మ అప్పటి నిజాం నవాబు పరిపాలన కాలంలో దొరలు భూస్వాముల ఆగడాలకు అడ్డు అదుపు లేని సమయంలో ప్రజల చేత వెట్టిచాకిరి చేయించుకుంటూ చిన్న సన్నకారు రైతులు పండించిన పంటల్లో అత్యధిక భాగం పన్నుల రూపంలో వసూలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ దున్నేవాడికే భూమి కావాలని భూమికోసo, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో సంఘం ఏర్పాటు చేసి పోరాడుతున్న కాలంలో పాలకుర్తి ఏరియాలో చిట్యాల ఐలమ్మ తన కుటుంబ సభ్యుల చేత పొలంలో పండించిన పంటను విసునూరి రామచంద్రారెడ్డి అనే దొర వారి పండించిన పంటను తరలించడానికి ప్రయత్నించిన సందర్భంలో వారిని ఎదిరించి తరిమికొట్టి తన పంటను తాను కాపాడుకోవడమే కాక ప్రజల్లో ఒక విశ్వాసాన్ని చైతన్యాన్ని పెంచిన సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలు దొరల అరాచకానికి వ్యతిరేకంగా సంఘం ద్వారా వారు బలోపేతం అయ్యారు.
తనకు జరిగిన అవమానాన్ని భరించలేక విసునూరి రామచంద్రారెడ్డి చాకలి ఐలమ్మని నిర్మూలించడానికి ప్రయత్నం చేసి హత్య చేయటం జరిగింది. ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా అనేకమంది భూస్వాములు ఆగడాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటును చేసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక గ్రామాలలో భూ పోరాటాలు నిర్వహించటం జరిగింది. అని దాని ద్వారా అనేక గ్రామాలలో లక్షలాది ఎకరాల భూములను పేదలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.
కానీ నేటి పాలకులు బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలను పెంచి మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజా సమస్యలను పక్కనపెట్టి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వైశ్యామ్యాలను పెంచుతున్నారని వీటికి వ్యతిరేకంగా ప్రజలందరూ కుల మతాలకతీతంగా తిప్పి కొట్టాలని చిన్న సన్న కారు రైతుల చేతుల్లో ఉన్న భూములను బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చట్టాలను మార్చాలని చూసారని కార్మికుల హక్కులను కాలరాసే విధంగా పోరాడి సాధించుకున్న చట్టాలను కుదించారని కూలీల పైన ఉపాధి హామీ నిధులను తగ్గించి ఉపాధిని హరిస్తున్నారని ప్రజాధనాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కుల మత ప్రాంతాల కతీతంగా ఐక్యంగా పోరాడి ఐలమ్మ స్ఫూర్తిగా తమ హక్కులను కాపాడుకోవాలని ఆయన అన్నారు. అంతకుముందు ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడంతోపాటు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, మల్యాల గోవర్ధన్, జిల్లా కమిటీ సభ్యులు రామ్మోహన్రావు మరియు నగర కమిటీ సభ్యులు దేరంగుల కృష్ణ, కటారి రాములు, అబ్దుల్, అన్వేష్, నరసయ్య, రహమత్, ఆసిఫ్, సూరి, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.