A9 న్యూస్ ప్రతినిధి:
తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలి తే.యూ పి.డి.ఎస్.యు
తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 200 కోట్లు కేటాయించాలని తే.యూ పీ డి ఎస్ యూ నాయకులు రవీందర్, అక్షయ్ లు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్ లో పత్రికా సమావేశం తే. యూ పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని గత పాలకులు విసి ధ్వంసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం పాటు పడాలని, రాష్ట్ర బడ్జెట్ లో యూనివర్సిటీ కి 200 కోట్లు కేటాయించాలని, రెగ్యులర్ వీసీ లను నియమించాలని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని, యూనివర్సిటీ హాస్టల్స్లో లో నాణ్యమైన భోజనం అందించాలని, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ, అర్జున్, రాకేష్, సాయి కృష్ణ, సాయి ప్రకాష్ మన్యంకొండ తదితరులు పాల్గొన్నారు.