నిజామాబాద్ A9 న్యూస్:
*ఆశల పల్లకిలో తెలంగాణ ప్రజలను ఊరేగించడమా…..
*దళిత బంధు కు బ్రేక్…..
*గృహలక్ష్మి కి బ్రేక్…..
*ఎలక్షన్ కోడ్ ముందు ఉందని తెలిసి కూడా ఎందుకు జాగ్రత్త పడలేదు మన తెలంగాణ ప్రభుత్వం….
*పేద ప్రజల కు ఆశ పెట్టడమేనా లేక నిధులు లేవా…..
*ఎక్కువ మాట్లాడితే బెదిరింపులు ఉన్న పథకాలను ఊడదీస్తాం మీకు వచ్చే ఏ ఉచిత పథకాలు కూడా రాకుండా చేస్తాం అంటూ బెదిరింపులే
నిజామాబాద్ జిల్లాలో తీరు ప్రజాతీర్పు ప్రజల్లో నుంచి పుట్టిన ప్రతి అక్షరం సాక్షిగా ఈ కథనం స్వచ్ఛం అనుకున్నదే జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది.
కొత్త పథకాలు, ప్రారంభోత్సవాలకు బ్రేకులు పడినట్టే. కేవలం ప్రచారం చేసుకోవడమే తప్ప జనాలకు తాయిలాలు, పథకాల లబ్ది చేకూర్చేందుకు దారులు మూసుకుపోయాయి. ఇంతకు ముందే ప్రవేశ పెట్టిన పథకాలు అమలు చేయవచ్చు.
కానీ అవీ అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. దీంతో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవడం, వాటిని ఆపేయడం చేస్తుంది.
దీంతో జనాలకు ఇక ఎన్నికలే తప్ప .. పథకాల అమలు ఉండవు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ మాత్రం అందే అవకాశం ఉంది. ఇప్పుడు చర్చలోకి వస్తున్న పథకం..
దళితబంధు మొదటి విడతగా తూతూ మంత్రంగా కొంత మందికి ఇచ్చి దీనిపై పెద్ద ప్రచారం చేశారు. రెండో విడతకు లిస్టు రెడీ అయ్యింది. ఎంక్వైరీ పూర్తయ్యింది. కలెక్టర్ వద్ద ఫైనల్ లిస్టు చేరింది. కానీ ప్రభుత్వం నిధులు మాత్రం విడుదల చేయకుండా జాప్యం చేసింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని కేసీఆర్‌కు తెలుసు. ఎందుకు మరి దీన్ని పెండింగ్‌లో పెట్టాడు. నిధుల లేమీ ఒక కారణం కాగా.. ఒకవేళ రెండో లిస్టు ఇస్తే చాలా మంది రాని వాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుంది. దీంతో ఇది పెండింగ్‌లో పెట్డడమే మేలనుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలై.. కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు దళితబంధు ఇస్తామని ప్రకటిస్తారు.
ఓటర్ల తీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అయోమయంలో తెలంగాణ ప్రజలు కానీ దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరికీ పది లక్షల చొప్పున దళితబంధు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది పెద్దమొత్తం కావడంతో నియామవళిని ఉల్లంఘించినట్టేనని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తాయి.
ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని దీన్ని అడ్డుకుంటుంది. చూశారా మేం ఇస్తామంటే వాళ్లే అడ్డుకుంటున్నారు. మేం మళ్లీ ప్రభుత్వంలోకి రాగానే వెంటనే అందరికీ దళిత బంధు ఇచ్చేస్తామని ఓ హామీ అలా ఇచ్చేస్తారు. ఇలా తమకు ఎన్నికల్లో లబ్ది చేకూరే వ్యూహంలో భాగంగానే బీఆరెస్ దళితబంధు రెండో విడత ఇవ్వలేదని తెలుస్తోంది.
గృహ లక్ష్మీ స్కీమ్ కూడా అంతే. కొందరికి కొన్ని చోట్ల ఎంపిక చేసిన తమ పార్టీ వారికి ఇచ్చారు అందులో భాగంగా జాబర్లకు గవర్నమెంట్ జాబర్ ల కు పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు పొద్దున లేస్తే నాయకుల ఇంటి ముందు క్యూ కట్టుకొని నిలబడే నాయకులకు ఉన్నవారికి మాత్రమే ఇచ్చారు. అసలైన నిరుపేదలకు చాలా మందికి ఆశపెట్టి పెండింగ్‌లో పెట్టేశారు.
పల్లెటూరి గ్రామాల్లో పార్టీల కోసం పనిచేసిన వ్యక్తులకు కూడా అందని ఆ పథకాలు అందుతాయో లేవో కూడా తెలియని స్థితిలో పేద ప్రజలు నాయకులను మంత్రులను అడ్డుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది . అసలు మళ్లీ గెలుస్తారా , గెలిస్తే ఇస్తారా , లేదా అని కూడా అర్థం కాలేని సందేహం ఎందుకంటే ఇందాక ఎన్నో పేర్ల నుంచి వచ్చిన పథకాలు వాళ్ల పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకే కానీ పూరి గుడిసెల్లో కూలి నాలి పని చేసుకుని పొట్ట పోసుకుంటున్న పేదవారి కోసం మాత్రం ఏ పథకం అందడం లేదు ఇలా ఇంకెన్నాళ్లు అని ప్రశ్నిస్తున్న ప్రజలు నాయకులను కార్యకర్తలను గ్రామాల్లో అడ్డుకున్నా కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఎక్కువ మాట్లాడితే బెదిరింపులు ఉన్న పథకాలను ఊడదీస్తాం మీకు వచ్చే ఏ ఉచిత పథకాలు కూడా రాకుండా చేస్తాం అంటూ బెదిరింపులే కానీ పేద ప్రజలను సంతోషపెట్టే ఏ ఒక్క నమ్మక మైన మాటలు లేవు కాంగ్రెస్ ఇదే పథకానికి ఐదు లక్షలు ఇస్తానంటుంది. ఇది బీఆరెస్‌కు దెబ్బ పడేలా ఉంది. అందుకే బీఆరెస్ మ్యానిఫెస్టోలో ఐదు లక్షలకు పెంచి.. తాము అధికారంలోకి రాగానే ఐదు లక్షలు ఇస్తామని ప్రకటించేస్తారు.
దీంతో పాత గృహలక్ష్మీ మరిచిపోతారు. కొత్తదాని కోసం వేచిచూస్తారు. ఇలా.. ఈ రెండు పథకాలు బిఆర్ఎస్ కు మేలు చేసేలా ‘కోడ్’ను తమకు అనుకూలంగా మలుచుకోనుంది బీఆర్ఎస్.