*వినయ్ రెడ్డి & కో – 100 కోట్ల మోసం అనేది ఫేక్ న్యూస్…
*దుష్ప్రచారాన్ని జీవన్ రెడ్డి బృందం సృష్టించినట్లు ఆరోపణలు….
A9 న్యూస్లో వచ్చిన వార్తకు స్పందించిన వినయ్ రెడ్డి…
A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వినయ్ రెడ్డి & కో – 100 కోట్ల మోసం, 61 ప్లాట్ బాధితులు అనే వార్తను స్థానిక ప్రజలు, కాంగ్రెస్ వర్గాలు పూర్తిగా ఫేక్ న్యూస్‌గా ఖండించాయి.
బాధితుల లేఖ కూడా పూర్తిగా కల్పితం కాగా, పేర్లు, చిరునామాలు, డాక్యుమెంట్ల ఏ ఆధారమూ లేవని వినయ్ రెడ్డి స్పష్టం చేశారు.
*ఫేక్ న్యూస్ ఎలా సృష్టించబడింది..? కాంగ్రెస్ వర్గాల ఆరోపణ ప్రకారం—
వినయ్ రెడ్డి ప్రజాదరణ ఆర్మూర్‌లో భారీగా పెరుగుతుండటంతో, జీవనరెడ్డి & కో బృందం కావాలనే మోసపూరిత కథనాన్ని తయారు చేసి మీడియా పేరుతో ప్రసారం చేసింది.
గుండ్లపోచమ్మ గ్రామం సర్వే నంబర్–53లోని భూమి పీవీఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ 10,240 గజాల భూమి ఒక్కొక్కరికి 40–60 లక్షల వసూళ్లు మొత్తం 61 ప్లాట్ బాధితులు ఈ వివరాలన్నీ పూర్తిగా గాలిలో లేచినవే అని వినయ్ రెడ్డి స్పష్టం చేశారు.
వినయ్ రెడ్డిని కించపరచేందుకు రాజకీయ కుట్ర — స్థానిక నాయకులు ప్రజల అభిప్రాయం ప్రకారం—
ఆర్మూర్‌లో పని చేస్తోన్న వ్యక్తిని అడ్డుకోవడానికి జీవన్ రెడ్డి అనుచరులు ఫేక్ కేసులు, ఫేక్ లేఖలు, ఫేక్ కథనాలు తయారు చేస్తున్నారు అని మండిపడుతున్నారు.
కొంతమంది స్థానికులు స్పష్టంగా చెప్పారు — ఫేక్ న్యూస్‌తో వినయ్ రెడ్డిని ఆపాలనుకోవడం ప్రజలను అవమానించినట్టే అని తెలుస్తుంది.







