ఆర్మూర్ A9 న్యూస్, ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బుదవారం నాడు జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని సైన్స్ ఎక్స్పో ని నిర్వచించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా.జి.ప్రకాష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నిత్య జీవితంలో సైన్స్ చాలా ఉన్నతమైన పాత్రని పోషిస్తుంది అని, టెక్నాలజీ పై విద్యార్ధులకు పట్టు ఉండాలని ఆకాంక్షించారు.అలాగే పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు, మాట్లాడుతూ దేశ నిర్మాణం లో సైన్స్ ది చాలా ముఖ్యమైన పాత్ర అని అన్నారు.ఈ సైన్స్ ఫేర్ లో భాగంగా 1వ తరగతి నుండి 9వ తరగతి విధ్యార్థులు అనేక సైన్స్ ప్రాజెక్ట్స్ తయారు చేశారు.ఈ కార్యక్రమంలో లో పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తు, ప్రైమరీ కో ఆర్డినేటర్ ప్రసన్న, ప్రీ ప్రైమరీ కో ఆర్డినేటర్ శ్రీ విద్య, డీన్ సంతోష్, సి ఇంఛార్జి రాకేష్ మరియు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు