నిజామాబాద్ A9 న్యూస్, జనవరి 29:
ఫిబ్రవరి 3 న ఢిల్లీలో జరిగే ప్రొటెస్ట్ మార్చ్ ను విజయవంతం చేయండి పి.డి.ఎస్.యూ
నూతన జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయాలని ఫిబ్రవరి 3న ఢిల్లీలో జరిగే ప్రొటెస్ట్ మార్చ్ ను విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రదాన జన్నారపు రాజేశ్వర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలో పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.
అనంతరం జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానం (N.E.P) 2020 రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, నూతన జాతీయ విద్యా విధానం ( 2020) లో నేడు ఉన్న అకాడమీక్ స్ట్రక్చర్ మార్చి 5+3+3+4 ని తీసుకొచ్చినరని, దీని ద్వారా విద్యార్థులకి ఐడియాలాజికల్ ప్రేమ్ వర్క్ దెబ్బతింటుందని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఈ విధానానికి అలవాటు పడలేక చదువులు మధ్యలో ఆపవేసే ప్రమాదం ఉందని, నాలుగు సంవత్సరాల డిగ్రీ లో డ్రాప్ అవుట్ పెరిగే ప్రమాదం ఉందని, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలు మన దేశ విద్య రంగాన్ని కబలిస్తున్నాయని, దుర్మార్గమైన న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి వ్యతిరేకంగా పోరాడాలని, దీనికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 3న విద్యార్థులు మేధావులు టీచర్లు ఢిల్లీ జంతర్ మంతర్ లో జరిగే ప్రొటెస్టు మార్చ్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు ప్రిన్స్, నాయకులు వంశీ, గంగాధర్, విట్ఠల్, రేఖ, గౌతమి, దేవిక, గణ తదితరులు పాల్గొన్నారు