నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం 5లక్షల రూపాయల నుంచి 10లక్షల రూపాయలు పెంపు పథకం నీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కు వచ్చే వారు నమ్మకంతో వచ్చే విధంగా ప్రవర్తించాలి అని ప్రభుత్వ దవాఖానకు వస్తె రోగం నయం అవుతుంది అని నమ్మకం రావాలని అన్నారు. అయుష్మాన్ భారత్ లో బాగంగా కొన్ని ప్రవేట్ దవాఖానలో కూడా చికిత్స లు చేస్తారు ఆని అన్నారు. అనంతరం ఆర్టీసి బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ను ప్రారబించరూ మహిళలు పల్లేవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులో తెలంగాణ రాష్ట్రం లో ఎక్కడికి అయిన ఉచితంగా ప్రయాణించవచ్చు సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వినోద్, ఎమ్మార్వో శ్రీకాంత్, డాక్టర్ నాగరాజు, బీజేపీ నాయకులు కంచెట్టీ గంగాధర్, యమాద్రీ బస్కర్, పాలెపు రాజు తదితరులు పాల్గొన్నారు.