Saturday, May 17, 2025
More
    More

      ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా?: సీఎం రేవంత్ రెడ్డి.

      - Advertisement -spot_img

       

      హైదరాబాద్: మార్చి 16

      మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌,పై తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి,సెటైర్లు వేశారు. కేసీఆర్‌ వర్క్‌ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా? లేక వర్క్‌ ఫ్రమ్ ఫామ్‌హౌసా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎలా అని ప్రశ్నించారు.

      15 నెలలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతభత్యాలు పొందుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహించారు. ఎమ్మె ల్యేగా కేసీఆర్ ఇప్పటి వరకూ రూ.57 లక్షల జీతం తీసుకుని కేవలం‌ రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని మండిపడ్డారు.

      ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడు తూ..”కేసీఆర్‌ ఆరోగ్యంగా ఉండాలని, అసెంబ్లీకి రావాలని కోరుతున్నా. నిద్రపోయే వారిని లేపొచ్చు కానీ.. నటించే వారిని లేపలేం. సభకు వచ్చి కేసీ ఆర్‌ విలువైన సూచనలు ఇవ్వాలి. ఆయన సభకు రాకుండానే లక్షల రూపాయలు జీతంగా తీసుకుంటున్నారు.

      అసెంబ్లీకి కేసీఆర్‌ రారు.. ఆయన తన నియోజక వర్గంలోనూ క్షేత్రస్థాయిలో పర్యటించరు. రైతుల ఆత్మహత్యలకు వారి అప్పులే ప్రధాన కారణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం.

      ఆరు నెలల్లోనే రూ.25 వేల కోట్ల రుణమాఫీ కింద చెల్లించాం. అన్నదాతలకు క్వింటాల్‌ వరికి రూ.500 బోనస్‌ ఇస్తున్నాం. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకుండానే 1.57 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాంధించాం.

      గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని ప్రజలే అంటున్నారు. కాంగ్రెస్‌ కట్టిన ప్రాజెక్టులే రైతులకు నీరిస్తున్నాయి

      Latest news
      Related news

      LEAVE A REPLY

      Please enter your comment!
      Please enter your name here