కామారెడ్డి A9 news
సదాశివ నగర్ మండలం భూంపల్లి, అడ్లూరు, ఎల్లారెడ్డి గ్రామంలో అంగన్వాడి కేంద్రం నందు తల్లిపాల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంగన్వాడి సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ అక్కడికి వచ్చిన పిల్లతల్లులకు తల్లిపాల గురించి అవగాహన చేయడమైనది. మహిళల్లో అవగాహన కల్పించేందుకు తల్లిపాల వారోత్సవాల పేరిట ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది అని తెలిపారు. తల్లిపాలు రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి. బిడ్డకు పాలు ఇవ్వడంతో తల్లీబిడ్డకు కలిగే ప్రయోజనాలు. ఎలాంటి ఆహరం తీసుకోవాలి, తదితర, బిడ్డ పుట్టిన తర్వాత అర గంటలోపు వచ్చే పాలను ముర్రుపాలు అవి శిశువుకు కచ్చితంగా పట్టాలి, తద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు సమతుల ఆహారం అందుతుంది. వీటిలో మాంసకృత్తులు, విటమిన్-ఏ ఉంటుంది. బిడ్డకు వ్యాధులు రాకుండా జీవిత కాలం కాపాడుతాయి. శిశువు పేగులను శుభ్రం చేసి మల, మూత్ర విసర్జనకు తోడ్పతాయి. ఆరు నెలల వరకు బిడ్డకు తప్పనిసరిగా ప్రతిరోజు మూడు నుంచి పది సార్లు తల్లిపాలు ఇవ్వాలి అని విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి ఉపసర్పంచ్ పసుల సాయిలు, సొసైటీ చైర్మన్ సదాశివ రెడ్డి, అంగన్వాడి టీచర్ సంగవ్వ, అడ్లూరు, ఎల్లారెడ్డి వార్డ్ మెంబర్ శ్రీకాంత్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు బుజ్జి , ఈదవ్వ, శశిరేఖ, వాణి, సరోజ,మంజుల, బాలనర్సవ్వ, ఆశా వర్కర్లు, ఎఎన్ఎమ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.