A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
*బీడీ కార్మికులకు కొత్త వేతన ఒప్పందం సఫలమైన చర్చలు…
*పెరిగిన వేతనాలను మే 1వ తేదీ నుండి అమలు చేయాలి…
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు
భారత కార్మిక సంఘాల సమాఖ్య ( ఐఎఫ్టియు ) ఆర్మూర్ ఆఫీస్ లో రాష్ట్ర కమిటీ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు బి.భూమన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.సూర్య శివాజీ మాట్లాడుచు తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీలు చుట్టే కార్మికులకు, బీడీ ప్యాకర్లు, బట్టీవాలా, చెన్నివాలా, బీడీ చాటర్స్, ట్రై పిల్లర్, క్లర్క్స్ మొదలగు కేటగిరీలకు చెందిన కార్మికులకు గత వేతన ఒప్పందం తేది 30.04.2024తో ముగిసింది. కొత్త వేతన ఒప్పందం కోసం మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ తరా పూన కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది. ఫలితంగా తేదీ 25.05.2024న బీడీ కార్మిక సంఘాలకు బీడీ యాజమాన్య సంఘంతో హైదరాబాద్ కొంపల్లి లోని మినర్వా గ్రాండ్ హోటల్ లో చర్చలు జరిగినాయి.
ఈ చర్చల్లో బీడీ ప్యాకర్లకు నెలకు 3650/- నెలసరి ఉద్యోగస్తులకు 1700/- చొప్పున వేతనాల పెరిగినాయి మరియు బీడీలు చుట్టే కార్మికులకు వెయ్యి బీడీలకు (4.25 పై /-) చొప్పున కూలి రేట్ల పెంపుకు ఒప్పందం కుదిరిందని బి.భూమన్న, బి.సూర్య శివాజీ తెలిపినారు పెరిగిన వేతనాలు తేదీ 01-05-2024 సం “నుండి తేది 30-04-2026 అమలులో ఉంటాయి
ఈ చర్చల్లో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ( ఐ ఎఫ్ టి యు) రాష్ట్ర అధ్యక్షులు చింత భూమేశ్వర్, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య శివాజి, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ హరిత, రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ, రాష్ట్ర కోశాధికారి ఎస్.గంగాధర్, బీడీ యాజమాన్య సంఘం అధ్యక్ష/కార్యదర్శి లు హితేంద్ర ఉపాధ్యాయ, ధర్మేంద్ర గాంధీ దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ రష్మీత్ కాంత్ పటేల్ మరియు పి కే టి పి జిఎం రామన్ బాయ్ చార్ బాయ్ ఇంచార్జ్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ వేతనలు తెలంగాణలో గల నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల్, జగిత్యాల్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్ జిల్లాలో గల ఏడులక్షల మంది బీడీ కార్మికులకు వర్తిస్తుందని వరు తెలిపారు.
బీడీ కార్మికుల ఐక్యత వల్లనే కూలీరేట్లు పెరిగాయని, బీడీ కార్మికులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం పోరాటాలు చేయాలని కోరారు బీడీ యాజమాన్యాలు పెరిగిన వేతనాలను మే 1వ తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే పి గంగాధర్, సహాయ కార్యదర్శి ఏం సుప్రియ, ఎస్ వెంకటేష్ తదితరులులు పాల్గొన్నారు.