A9 న్యూస్ ఆర్మూర్ ప్రతినిధి ,ఏప్రిల్ 24:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం లోని సి వి రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించిన ఫలితాల్లో సివి రామన్ జూనియర్ కళాశాల విద్యార్థులు సాధించిన మార్కులు.
బైపిసి ద్వితీయ సంవత్సరం లో టి.వర్ష 963/1000, యస్.చందన 904/1000, ఎంపిసి ద్వితీయ సంవత్సరంలో ఏ.సాత్విక 935/1000, పి.సాహితి 928/1000, సిఈసి ద్వితియ సంవత్సరంలో బి.చిన్నా 813/1000, బి.భానులత 743/1000, అదే విధంగా ఎంపిసి ప్రథమ సంవత్సరంలో కే.తేజశ్విని 448/470, జీ.సాయితేజ 406/470, బైపిసి ప్రథమ సంవత్సరంలో ఎం.నిఖిత 429/440, డి.పల్లవి 404/440, సిఈసి ప్రథమ సంవత్సరంలో యం.విద్య 436/500, జి.నందిని 392/500, మార్కులు సాదిచడం జరిగింది.
ఈ సందర్బంగా మంచి ఫలితాలను సాధించిన విద్యార్థిని,విద్యార్థులను కరెస్పాండంట్ కొట్టూరు గిరిరాజ్ డైరెక్టర్లు దీకొండ అనిత కిషన్, కొట్టుర్ ప్రవీణ్ రాజ్, ప్రిన్సిపాల్ జాకీర్ హుస్సేన్, వైస్ ప్రిన్సిపాల్ వినోద్ కుమార్, అధ్యాపకులు రమాకాంత్, శ్రీనివాస్, నరేష్, శేఖర్, హర్షవర్దిని,గాయత్రి, గంగమోహన్, మల్లికార్జున్, డి.నరేష్, భాజన్న, మోహన్ బాబు, విద్యార్థులను అభినందించారు.