Monday, November 25, 2024

తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల నందు రెండో రోజు కొనసాగిన రాష్ట్రస్థాయి మహిళా డిగ్రీ కళాశాల సంస్కృతిక ప్రదర్శనలు

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

కామారెడ్డి A9 న్యూస్, ఫిబ్రవరి 7:

 

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నందు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల (మర్కల్) కామారెడ్డి నందు స్టేట్ లెవెల్ వైబ్రేషన్ (కల్చరల్ ఫెస్ట్) రెండవ రోజు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా కళాశాల పూర్వ విద్యార్థిని మాలవత్ పూర్ణ మరియు ఎమ్.ఎల్.సి కూర రఘూత్తమ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డాక్టర్ జి.నిరూప, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ యశోలత, కళాశాల ల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు మరియు మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ సంగారెడ్డి విచ్చేయడం జరిగింది. పూర్ణ విద్యార్థులు ఎలా కష్టపడి ఎదగాలి, తల్లిదండ్రులు మరియు గురువుల ఆశలను ఎలా తీర్చాలి, వారిని ఎలా సంతోష పరచాలనేది విద్యార్థులకు తెలియ జేసింది. తర్వాత 24 రకాల సాంస్కృతిక మరియు విద్యాసంబంధ ప్రదర్శనల్లో 30 డిగ్రీ కళాశాలల విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తం 24 విభాగాలలో విజేతలకు కళాశాల కు వచ్చిన అతిథులు, ప్రథమ, ధ్వితీయ, తృతీయ నగదు బహుమతులను అందజేయడం జరిగింది. 9 రకాల పోటీల్లో విజేతలు గా నిలిచి, కామారెడ్డి రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ఓవరాల్ ఛాంపియన్ షిప్ ను సాధించిన కళాశాల గా నిలిచింది. అతిథులందరిని ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.రాధిక మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తమ తొడ్పాటును అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో రీజినల్ కో ఆర్డినేటర్ కే. అలివేలు మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, 30డిగ్రీ కళాశాల ల అధ్యాపకులు కామారెడ్డి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here