నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వనికి కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకం నిలబెడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తా అని అన్నారు, జీవన్ రెడ్డి రెండు పర్యాయలు ఎమ్మెల్యే గా ఉండి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని, జీవన్ రెడ్డి ఆస్తుల అభివృద్ధి తప్ప ప్రజల జీవతాల్లో అభివృద్ధి జరుగలేదు అని, కాంగ్రెస్ హయాంలోనే వ్యవసాయనికి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు నీరు ఇచ్చి రైతులకు మేలు చేసాం అని, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు, ఆర్మూర్ పట్టణనికి 100 కోట్లతొ త్రాగునీటి పథకం, లక్కంపెల్లిలో ఉపాధి కోసం సెజ్, ఆర్మూర్ నుండి నందిపేట్ డబుల్ రోడ్డు, ఫీజు రియేంబర్స్ మెంట్ వంటి వాటితో యువతకు ఉన్నత విద్యా అందించం అని, రైతులకు రుణమాఫీ, మద్దత్తు ధర అందించాం అని అన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యే చేసిన జీవన్ రెడ్డి వారు ఎన్నికల్లో చెప్పినట్లు ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కూడ ఇవ్వలేదు అని, కొత్త ఎత్తి పోతల పథకాలు నిర్మించ లేదు అని, రుణమాఫీ జరుగలేదు అని, రైతులు మద్దత్తు ధర కోసం ధర్నాలు చేస్తే వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టిన చరిత్ర జీవన్ రెడ్డిది అని అన్నారు, కాంగ్రెస్ హయాంలోలోనే కాలనీలు కాలనీలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చాం అని, నేడు జీవన్ రెడ్డి ప్రభుత్వ స్థలాలే కాకుండ ప్రభుత్వ స్థలాలను కూడ కబ్జా చేస్తున్నాడు అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు 100 రోజుల్లోనే అమలు చేస్తాం అని, రైతులకు రుణమాఫీ, మద్దత్తు ధరలు, యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని అన్నారు.
బిజెపి నాయకులు రాకేష్ రెడ్డి మాట్లాడుతు జీవన్ రెడ్డి నేను ఒక్కటే అని అంటున్నడు అని నేను రాకేష్ రెడ్డికి సవాల్ విసురుతున్న తడి బట్టలతొ సిద్దుల గుట్ట ఎక్కుత అని నీకు దమ్ముంటే నాతో పాటు తడి బట్టలతొ సిద్దుల గుట్ట ఎక్కుమని అన్నారు, 10 రోజులకు ఒకసారి నువ్వు జీవన్ రెడ్డితొ మాట్లాడుతావు అని, దమ్ముంటే నీతితొ కూడిన రాజకీయం చేసి ఎదురుకొ అని, చౌకబారు రాజకీయం బంద్ చేయమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్, పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, ఫాయీమ్, అజ్జు, జిమ్మ రవి తదితరులు పాల్గొన్నారు.