నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఎంఆర్ గార్డెన్స్ లో రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ ఐక్య వేదిక నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం కల్పించి ఎవరైతే అత్యధిక స్థానాలు బీసీ లకు కేటాయిస్తారో వారికి బీసీల మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో బీసీ సంఘం తరఫున నిర్వహించే ఏ వేదికకైనా బీసీలందరూ హాజరుకావాలని తెలిపారు. రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు ఏ రాజకీయ పార్టీ కూడా సముచిత స్థానం కల్పించట్లేదని బీసీలకు అన్యాయం చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
బీసీల రాజ్యాధికారం కోసం పోరాడుదమని పిలుపు నిచ్చారు. ఎస్సి లను కలుపుకొని బీసీ లు వెళ్లాలని, ఎస్సి, బీసీ లు వేరు కాదన్నారు. రెండు కలిసి పోరాడితేనే విజయం సాధ్యమన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాధర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు డేగ పోశెట్టి, జిల్లా సెక్రెటరీలు రాజేశ్వర్, శేషాద్రి, రెగుళ్ల సత్యనారాయణ, హనుమాన్లు, గంగన్న, నారాయణ యాదవ్, విటల్, సాయికిరణ్, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు